కోడేరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని పస్పుల బ్రాంచ్ కెనాల్ కాల్వ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రిజర్వాయర్ వద్ద ఉన్న ఐదు మోటార్లు పనిచేయడం లేదని, ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. అందుకు మెయిన్ కెనాల్‌కు నీరు తక్కువగా రావడంతో వివిధ మండలాలకు వెళ్లే నీరు రైతులకు అందడం లేదన్నారు. నీటి సామర్థ్యం పెంచడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. కోడేరు, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఈఈ రవీందర్, డీఈ లింగన్న, సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
10న ఇంటర్వ్యూ
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన నియమించేందుకు సోమవారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 3 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.