సహకార సంఘాల బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల బలోపేతానికి కృషి

Mar 6 2025 12:16 AM | Updated on Mar 6 2025 12:15 AM

రాష్ట్ర మార్కెటింగ్‌, రవాణా, సహకార శాఖల కమిషనర్‌ సురేంద్ర మోహన్‌

ఉప్పునుంతల: రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్‌, రవాణా, సహకార శాఖల కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ అన్నారు. బుధవారం ఉప్పునుంతల సింగిల్‌విండో కార్యాలయా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ప్రగతి సాధించడానికి అవలంబిస్తున్న పద్దతు లు, సేవలు తదితర విషయాలను పీఏసీఎస్‌ చైర్మన్‌ భూపాల్‌రావు, సీఈఓ రవీందర్‌రావు కమిషనర్‌కు వివరించారు. సంఘం పనితీరు.. సభ్యులకు అందిస్తున్న పలు రకాల రుణాలతో పాటు ఎరువుల సరఫరా.. వరి, మొక్కజొన్న, వేరుశనగ కొనుగోలు వంటి కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. 2008లో రూ. 63లక్షల అప్పులో ఉన్న సహకార సంఘం.. ప్రస్తుతం రూ. 4కోట్ల లాభాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. పీఏసీఎస్‌ల ద్వారా ఎలాంటి కొరత లేకుండా ఎరువులను అందిస్తున్నామని మార్క్‌ఫెడ్‌ డీఎం నర్సింహారావు తెలిపారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రగతిలో ఉన్న పీఏసీఎస్‌ల్లో అవలంబిస్తున్న పద్ధతులు, అందిస్తున్న సేవలపై అధ్యయనం చేసి.. బలహీనంగా ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంచి ప్రగతిలో ఉన్న ఉప్పునుంతల పీఏసీఎస్‌ను సందర్శించినట్లు తెలిపారు. సంఘం పాలకవర్గం, సభ్యులు, సిబ్బంది సమష్టి కృషితో పీఏసీఎస్‌ ఆ ర్థికాభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. పీఏసీఎస్‌ ద్వారా పెట్రోల్‌ పంపు, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌, గోదాముల ఏర్పాటుకు అవసరమైన చర్య లు తీసుకుంటామన్నారు. అనంతరం ఏఏసీఎస్‌ ఏర్పాటుచేసిన వేరుశనగ కొనగోలు కేంద్రాన్ని కమిషనర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ శాఖ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాదరావు, జిల్లా అధికారి స్వరణ్‌ సింగ్‌, జిల్లా సహకార అధికారి రఘునాథరా వు, డీటీఓ చిన్నబాలు, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శులు నర్సింహులు, డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, అనంతరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్లు నారాయణరెడ్డి, శ్రీను, సాయిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement