కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఆదివారం 234 మంది రైతులు 165 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 7,529 కనిష్టంగా రూ.4,001, సరాసరి రూ. 6,610 ధరలు వచ్చాయి. మరో ముగ్గురు రైతులు 18 క్వింటాళ్ల కందులను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 6,420, కనిష్టంగా రూ. 6,209 ధర పలికింది. ఇక నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో రెండు రోజులపాటు మాత్రమే క్రయవిక్రయాలు ఉంటాయని కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ఆది, గురువారాల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలని రైతులకు సూచించారు.