హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

Mar 2 2025 1:43 AM | Updated on Mar 2 2025 1:43 AM

నాగర్‌కర్నూల్‌/ అచ్చంపేట రూరల్‌: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ నెల 31లోగా క్రమబద్ధీకరించి ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్‌ కమిషనర్‌ నరేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందుకోసం నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌ఎస్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ హెల్ప్‌ డెస్క్‌లో తెలియజేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 79955 15737, 94941 41708లను సంప్రదించాలని సూచించారు.

● అచ్చంపేటలోనూ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement