విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి

Mar 1 2025 7:59 AM | Updated on Mar 1 2025 7:54 AM

కందనూలు: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనకు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఏఎంవో షర్పుద్ధీన్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది అక్టోబర్‌లో డీఎస్సీ ద్వారా నియామకమైన 129 నూతన ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై శిక్షణలో భాగంగా మొదటిరోజు ప్రారంభమైంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిపెట్టి సామర్థ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగర్‌కర్నూల్‌ ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం సిద్ధిక్‌ అహ్మద్‌, రీసోర్స్‌పర్సన్స్‌ లక్ష్మీనర్సింహరావు, నెహ్రూప్రసాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కోడేరు: మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో చేరేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రాఘవేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నామని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

పల్లె దవాఖానాల్లో

మెరుగైన వైద్యసేవలు

బిజినేపల్లి: పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని వసంతాపూర్‌ గ్రామం పల్లె దవాఖానాను సందర్శించి, వర్చువల్‌ పద్ధతిలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల అసెస్‌మెంట్‌లో పాల్గొన్నారు. పల్లె దవాఖానాల్లో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ వంటివి పరిశీలించారు. క్షయ నిర్మూలన, దోమకాటులో వ్యాధుల నియంత్రణ, అసంక్రమిత వ్యాధుల నివారణ వంటి కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రియాంక, డీపీఓ రేణయ్య, క్యూసీ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, ఆశాలు పాల్గొన్నారు.

వేలం పాట వాయిదా

చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయంలో శనివారం ని ర్వహించే వేలం పాట అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్‌ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాట తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.

విద్యాప్రమాణాలు  పెంపొందించేందుకు కృషి 
1
1/1

విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement