నాగర్‌కర్నూల్: వచ్చేనెల 5 నుంచి 22 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో సరిపడా ఫర్నిచర్, తాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవ్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరంలో 6,977 మంది పరీక్షకు హాజరు కానున్నారని, వీరికోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 14 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 11 మంది అదనపు సూపరింటెండెంట్లు, ఇద్దరు ఫ్లయింగ్, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఆరుగురు కస్టోడియన్లు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.