కందనూలు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు బుధవారం ద్వితీయ సంవత్సరం పరీక్షలతో ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 6,239 మంది విద్యార్థులకుగాను 5,960 మంది హాజరు కాగా 281 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కేటగిరిలో 5,273 మందికిగాను 5038 మంది హాజరరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారు. అలాగే, ఒకేషనల్‌లో 966 మందికిగాను 922 మంది హాజరుకాగా 46 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల అనంతరం కేంద్రాల నుంచి విద్యార్థినులు బయటికి వచ్చి ఒకరినొకరు సంతోషంగా వీడ్కోలు పలికి ఇంటిముఖం పట్టారు.
చివరి రోజు 281 మంది గైర్హాజరు