
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
గోపాల్‌పేట: రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. సోమవారం మండలంలోని మున్ననూరులో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరి యా, పురుగు మందులను తగిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు భూసార పరీక్షలతో కలిగే లాభాలు, పంట అవశేషాలను కాల్చడంతో కలిగే నష్టాలను వివరించారు. సాగు సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే పంటమార్పిడి చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, ఆయిల్‌పాం సాగు చేపట్టాలని కోరారు.