
పరిశీలన కొనసాగుతోంది..
రాజీవ్‌యువ వికాసం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులతోపాటు బ్యాంకు అధికారులు సమగ్రంగా దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు. బ్యాంకుల పరిశీలన పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తాం.
– ఖాజా నిజాం అలీ, బీసీ సంక్షేమ శాఖాధికారి, నాగర్‌కర్నూల్
అర్హులకు అందించాలి..
రాజీవ్ యువవికాసం కింద ఫొటోస్టూడియో ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి సకాలంలో సబ్సిడీ రుణాలను అందజేయాలి.
– రాజశేఖర్, మన్ననూర్, అమ్రాబాద్ మండలం
●