
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
కొల్లాపూర్: వరి ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీచేసి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యంపై కప్పేందుకు అవసరమైన టార్పాలిన్లు మార్కెట్ సిబ్బంది ఇవ్వలేదని, కేంద్రంలో కనీసం తాగునీటి వసతి కల్పించ లేదని, రాత్రిళ్లు విద్యుత్ లేక ధాన్యం, ఇతర సామగ్రి చోరీకి గురవుతోందని రైతులు మంత్రికి వివరించారు. వెంటనే కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వారు మంత్రికి వివరించగా.. రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని మార్కెట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. కొనుగోలు కేంద్రం నిర్వహణ బాధ్యతను ఇతరులకు అప్పగించాలని కోరారు. మంత్రి వెంట సింగిల్‌విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, నాయకులు పస్పుల నర్సింహ, ఎక్బాల్, కేతూరి ధర్మతేజ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు
చెక్కుల పంపిణీ..
పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన పలువురికి మంగళవారం క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. బేస్‌మెట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తయిన వారికి రూ.లక్ష అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. నాణ్యతగా నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల హౌసింగ్ ఏఈ రాజవర్ధన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్‌గౌడ్, వెంకటేశ్వర్‌రావు, నాయకులు దండు నర్సింహ, వెంకటస్వామిగౌడ్, రవికుమార్, బద్యానాయక్, చంద్రయ్యయాదవ్, రాంలాల్ నాయక్, గోవిందు, శ్రీశైలం, కృష్ణ, శంకర్‌నాయక్ తదితరులున్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు