
దళితులు చనిపోతే పూడ్చిపెట్టేందుకు జాగలేదు. మా పూర్వికులను ఇక్కడే పూడ్చి పెట్టాం. కానీ, కట్ట అభివృద్ధి పేరుతో సమాధులను తొలగించి వారి గుర్తులను చెరిపేశారు. శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారు తప్ప.. దళితుల సమస్యలు మాత్రం పట్టించుకోరు.
– బాబురావు, గాంధీనగర్, వనపర్తి
సమంజసం కాదు..
ఎప్పటి నుంచో ఉన్న సమాధులను అభివృద్ధి పేరుతో తొలగించడం ఎంతవరకు సమంజసం. సమాధులు లేకుండా పెద్దలకు ఎలా పెట్టుకోవాలి. ప్రస్తుతం చనిపోయిన వారిని పూడ్చి పెట్టేందుకు కూడా స్థలం లేదు. ఇదే విషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
– కొమ్ము సామేల్, దళితవాడ, వనపర్తి
