
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. పీహెచ్‌సీకి వైద్యం కోసం వచ్చిన రోగులకు బీపీ, షుగర్ లాంటి పరీక్షలతో పాటు జ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించగా 45మంది రోగులు వచ్చారని తెలిపారు. అనంతరం డ్రగ్ స్టోర్‌ను, ల్యాబ్ టెక్నీషియన్, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. కుక్క, పాము కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ మందులను మూడు నెలల వరకు సరిపోయే విధంగా రోగులకు ఇవ్వాలన్నారు. గ్రామాలలో మెడికల్ క్యాంప్‌లను నిర్వహించి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ సుచిత, ఫార్మసీ ఆఫీసర్ శారద, ఎన్సీడీ స్టాఫ్‌నర్స్ సంధ్య, రమాదేవి, ల్యాబ్, టెక్నీషియన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు