Virupaksha Movie Twitter Review In Telugu: విరూపాక్ష మూవీ ట్విటర్‌ రివ్యూ - Sakshi
Sakshi News home page

Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ టాక్‌ ఎలా ఉందంటే..

Apr 21 2023 7:14 AM | Updated on Apr 21 2023 8:12 AM

Virupaksha Movie Twitter Review In Telugu - Sakshi

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌. కార్తిక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. 

ఇప్పటికే పలు చోట్ల విరూపాక్ష ఫస్ట్‌ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్‌లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘విరూపాక్ష’ కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

(ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?)

సినిమాకు ట్విటర్‌లో పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడు కార్తీక్‌ సినిమాని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడని అంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉందట. సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ట్విస్టులు కూడా బాగున్నాయట. 

(ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!)

ప్రీ ఇంటర్వెల్‌లో చిల్‌ అయ్యే మూమెంట్స్ ఉన్నాయట. సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలిగేలా ఇంటర్వెల్‌ సెట్‌ చేశారట. మొదటిభాగంలో లవ్‌ స్టోరీ బోరింగ్‌గా ఉంటుందట. అలాగే సినిమా కూడా స్లోగా సాగుతుందని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement