మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు: ఉపాసన ట్వీట్ | Sakshi
Sakshi News home page

Upasana Konidela: మీ అతిథ్యం ఎప్పటికీ మరవలేనిది: ఉపాసన

Published Mon, Mar 4 2024 7:47 PM

Upasana Konidela Shares A post About Ananth Ambani Pre Wedding - Sakshi

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌ ఉపాసన- రామ్ చరణ్‌ ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌లో పలువురు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆదివారంతో ముగిశాయి.

తాజాగా ఈ వేడుకలకు హాజరైన ఉపాసన- రామ్ చరణ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా జీ- ముఖేశ్ జీ అతిథ్యం సాటిలేనిది.. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన వ్యక్తులతో.. అద్భుతమైన సమయం వెచ్చించినందుకు సంతోషంగా ఉందంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. 

Advertisement
 
Advertisement