రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు! | Ram Charan Peddi Movie Dialogue AI Video Trending On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Ram Charan Peddi AI Video: 'పెద్ది' వీడియో.. షాకవుతున్న ఫ్యాన్స్

Apr 9 2025 8:59 AM | Updated on Apr 9 2025 10:24 AM

Ram Charan Peddi Movie AI Video Latest

రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. ఈ మధ్య శ్రీరామనవమి సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాట్ తో ఉన్న చివరి షాట్.. అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.

సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా పెద్ది(Peddi Movie) డైలాగ్ చెబుతున్న చరణ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎవరో చెప్పేంతవరకు అది ఏఐ వీడియో అని కనిపెట్టలేం. అంత ఫెర్ఫెక్ట్ గా ఉంది మరి. 

(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)

బ్లాక్ డ్రస్సులో ఉన్న చరణ్.. 'ఒక పని సెసేనాకి.. ఒకే నాక బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడ సేసెయ్యాల.. పుడతామా యేటి మళ్లీ' ‍అని డైలాగ్ చెబుతున్నాడు. చూస్తుంటే ఒరిజినల్ వీడియోలా ఉన్న ఈ ఏఐ వీడియోని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న పీరియాడికల్ డ్రామా పెద్ది. వచ్చే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

Advertisement
 
Advertisement
Advertisement