
యూకేలో పదేళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తె కోసం ఇంకా వెతుకుతున్నారట మాధవన్. కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో. మాధవన్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో హిందీలో ‘బ్రిడ్జ్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రూ పొందిందని సమాచారం. ఈ చిత్రంలో మాధవన్, రాశీ ఖన్నా భార్యాభర్తలుగా నటించారని తెలిసింది. నిధీ సింగ్ ధర్మ, నాగరాజ్ దివాకర్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆల్రెడీ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ పూర్తయిందని, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. యూకేలో పదేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమార్తె కోసం దంపతులు చేసే ప్రయత్నాలు? ఆ అమ్మాయి ఎలా తప్పిపోతుంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టాక్.