
కొన్నాళ్ల ముందు వరకు ప్రియమణి.. దక్షిణాది భాషల్లో హీరోయిన్ మాత్రమే. ఎప్పుడైతే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. అటు ఓటీటీల్లో సినిమాలు,సిరీస్‌లు చేస్తూ మరోవైపు రెగ్యులర్ మూవీస్‌లోనూ ప్రధాన పాత్రలు చేస్తూ అలరిస్తోంది. ఇప్పుడు ఈమె కీ రోల్ చేస్తున్న కోర్ట్ థ్రిల్లర్ సిరీస్‌ని ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులో రాబోతుంది?
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా)
ప్రియమణి, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'గుడ్ వైఫ్'. అమెరికన్ సిరీస్ 'గుడ్ వైఫ్' అదే పేరుతో ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి డేట్ ప్రకటించలేదు గానీ త్వరలో హాట్ స్టార్‌లోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.
'గుడ్ వైఫ్' సిరీస్ విషయానికొస్తే.. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు ఓ మాజీ మహిళ లాయర్ ఏం చేసింది? అనేదే స్టోరీ పాయింట్. ఇందులో ప్రియమణి లాయర్‌గా కనిపించనుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించారు. వీళ్లకు ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నట్లు పోస్టర్‌లో చూపించారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)
