
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ దోశె కింగ్‌గా మారనున్నారట. వెండితెరపై ఈ హీరోని ఇలా మార్చనున్న దర్శకుడు ఎవరో కాదు... సూర్యతో ‘జై భీమ్’ వంటి ఆలోచన రేకెత్తించే సినిమా తీసి, విజయం సాధించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్. శరవణ భవన్ హోటల్ యజమాని రాజగో పాల్ జీవితం ఆధారంగా జ్ఞానవేల్ ఓ కథ తయారు చేశారని కోలీవుడ్ టాక్. ఈ కథని మోహన్‌లాల్‌కి వినిపించారట. ఆయనకు నచ్చి, ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. శరవణ భవన్ అధినేతగా రాజగో పాల్ గొప్ప పేరు సం పాదించుకున్నారు.
చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి చేరుకున్న ఆయన జీవితంలో ‘డార్క్ షేడ్’ కూడా ఉంది. ఓ హత్య కేసులో జీవిత ఖైదుగా ఆయనకు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఖైదీగా ఉన్న కొద్ది రోజులకే రాజగో పాల్ గుండె పోటుతో మరణించారు. రాజగో పాల్ సాధారణ వ్యా పారవేత్తగా మొదలై, ఎంతో ఎత్తుకి ఎదిగి, హత్య కేసులో ఇరుక్కుని డౌన్ ఫాల్ అయినంతవరకూ సినిమాలో చూపించనున్నారట జ్ఞానవేల్. సో... ఈ సినిమాలో మోహన్‌లాల్‌ని డార్క్ షేడ్‌లోనూ చూసే అవకాశం ఉందన్నమాట. ‘దోశె కింగ్’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూ పొందించనున్నారట. ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.