
హైదరాబాద్ నుండి తాడేపల్లి వస్తూ విమానంలోనే పుష్పగుచ్చం ఇచ్చి మహేశ్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి...'మహేశ్‌బాబు, నమ్రత ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరూ జీవితాంతం చిరునవ్వులతో సుఖసంతోషంగా ఉండాలి' అని కోరుకుంటూ చిరు ట్వీట్ చేశారు.
సాక్షి, విజయవాడ : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు గడించారు మహేశ్‌బాబు- నమ్రత శిరోద్కర్. నేడు(ఫిబ్రవరి 10న) ఈ జంట 17వ పెళ్లి రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చిరంజీవి, ప్రభాస్, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యేందుకు విజయవాడ వెళ్లిన విషయం తెలిసిందే కదా! ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లి చేరుకున్న విమానంలోనే పుష్పగుచ్చం ఇచ్చి మహేశ్‌కు విషెస్ తెలియజేశారు చిరంజీవి. 'మహేశ్‌బాబు, నమ్రత ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరూ జీవితాంతం చిరునవ్వులతో సుఖసంతోషంగా ఉండాలి' అని కోరుకుంటూ చిరు ట్వీట్ చేశారు.
Wishing @urstrulyMahesh &#NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness! pic.twitter.com/jp8RhrsHxn
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 10, 2022