
పర్యావరణ పరిరక్షణౖపై చిత్రలేఖనం పోటీలు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని ప్రసన్నకుమారి ప్రథమ బహుమతి, పదవ తరగతి విద్యార్థిని అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేశం, శశి, శేఖర్ పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్: లయన్స్‌క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహ బంధు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షుడు రాఘవేందర్‌రావు తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్యులకు సన్మానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జోన్ చైర్మన్ బుచ్చెష్, అశోక్, వెంకటస్వామి పాల్గొన్నారు.