
317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి
చేగుంట(తూప్రాన్): జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. గురు వారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కా లం వేతనం అందించాలన్నారు. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై తపస్ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చేగుంట మండల తపస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కృష్ణమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.