
‘పంటల బీమాఅమలు చేయాలి’
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదాగౌడ్, జిల్లా సలహాదారుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు రక్షణగా ఉంటుందన్నారు. పంటల బీమా లేకపోవడంతో రైతులు పలు విధాలుగా నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి రైతులను ఆదుకునేందుకు బీమా అమలు చేయాలని కోరారు.
రైతులకు సరిపడా ఎరువులు
చిన్నశంకరంపేట(మెదక్): వర్షాకాలం పంటలకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విన్సెంట్ వినయ్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో ఆగ్రోస్ సెంటర్, పీఏసీఎస్, ఫ ర్టిలైజర్ దుకాణాల్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 4 వేల మెట్రిక్ టన్నుల ఎరువు లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఈ–పాస్ విధానంలోనే రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఓ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
ఆయిల్‌పాం సాగుతో
అధిక లాభాలు
రామాయంపేట(మెదక్): ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఏడీఏ రాజ్‌నారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో రైతుల వద్ద నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. పంట ఉత్పత్తులను నేరుగా కంపెనీలే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చట్టం రూపొందించిందన్నారు. సబ్సిడీలు సైతం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు నమోదు
చేసుకోవాలి: ఆర్డీఓ
శివ్వంపేట(నర్సాపూర్): 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం శివ్వంపేటలోని రైతు వేదికలో బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు నమోదు చేసుకుని వారికి ఓటుహక్కు కల్పించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్ధీన్, ఆర్‌ఐ కిషన్, బీఎల్‌ఓలు ఉన్నారు.
అండగా ఉంటాం..
రామాయంపేట(మెదక్): కామారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలంలోని అక్కన్నపేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ చంద్రం, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, యూత్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, మాజీ జెడ్పీటీసీ సంపత్, అబ్ధుల్ అజీజ్, శ్రీకాంత్‌సాగర్ పాల్గొన్నారు.

‘పంటల బీమాఅమలు చేయాలి’

‘పంటల బీమాఅమలు చేయాలి’