
స్పోర్ట్స్ స్కూల్‌కు 14 మంది ఎంపిక
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్‌కు 14 మంది ఎంపికై నట్లు యువజన క్రీడలశాఖ జిల్లా అధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల మండలస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 35 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వారికి అవుట్‌డోర్ స్టేడియంలో గురువారం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుంచి 8 మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని చెప్పారు. విద్యార్థులకు 1, 2వ తేదీలలో ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ లో రాష్ట్ర స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు.