డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Jun 27 2025 6:29 AM | Updated on Jun 27 2025 6:29 AM

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

మెదక్‌జోన్‌: డ్రగ్స్‌ రహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నేటి యువత రేపటి భావిభారత పౌరులని, డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. డ్రగ్స్‌ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల విచక్షణ కోల్పోయి అనేక నేరాలు చేస్తున్నారని, ఇలాంటి కేసులు పెద్ద మొత్తంలో నమోదు అవుతున్నాయని తెలిపారు. అంతకుముందు రాందాస్‌ చౌరస్తాలో డ్రగ్స్‌ రహిత సమాజానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా, అదనపు ఎస్పీ మహేందర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సర్దార్‌సింగ్‌, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. గురువారం కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల తో పాటు పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం సీహెచ్‌సీని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి విడతలో జిల్లాలో 9 వేల ఇళ్లు మంజూరు చేయగా, 3,500 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అలాగే వర్షాకాలం నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులలో ఆలోచనశక్తిని పెంపొందించి కొత్త ఆవిష్కరణల కోసం ఇన్‌స్పైర్‌ చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో డీఈఓ రాధాకిషన్‌, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి సుదర్శన్‌ మూర్తితో కలిసి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు సెప్టెంబర్‌ 15వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని, ఎంపికై న విద్యార్థికి రూ.10 వేలు నజరాన ఇస్తామన్నారు.

తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement