
పల్లెలన్నీ చెత్తతో నిండిపోయాయి
● పంచాయతీ ట్రాక్టర్లకు
డీజిల్ పోసే దిక్కు లేదు
● ప్రభుత్వంపై
GÐðl$ÃÌôæÅ çßæÈ-ÔŒæ-Æ>Ð]l# OòœÆŠḥæ
నర్సాపూర్ రూరల్: గ్రామాలు స్వచ్ఛతగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలకు చెత్త తరలించేందుకు ట్రాక్టర్లు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం డీజిల్ పోసే దిక్కు లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మండలంలోని చిప్పల్‌తుర్తి గ్రామ పంచాయతీని సందర్శించి పారిశుద్ధ్య కార్మి కులతో పాటు పంచాయతీ కార్యదర్శితో మా ట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో చెత్త తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తే అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాబ్యా నాయక్ ఉన్నారు.
అరెస్టులపై కాదు.. గ్రామాలపై దృష్టి పెట్టు
అరెస్టులపై కాదు.. గ్రామాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేయించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అన్న మార్పు ఇదేనా అని ఎద్దేవా చేశారు. 10 నుంచి 20 శాతం పర్సంటేజీలు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం నెలకు ఒకసారి కూడా సచివాలయానికి పోవడం లేదని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడమే సరిపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.
కార్యదర్శికి మెమో ఇవ్వడం సరికాదు: ఎమ్మెల్యే
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై వివరాలు అడిగితే చిప్పల్‌తుర్తి పంచాయతీ కార్యదర్శి శ్రుతిజకు కలెక్టర్ మెమో జారీ చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులు చెప్పారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాము అండగా ఉంటామని చెప్పారు.