
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ ఉద్యమంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిర్భావ ఉత్సవాలకు ముస్తాబైంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు జిల్లా అధికారులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి మెదక్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థానికులు అమరవీరుల స్తూపం నిర్మాణం చేపట్టారు. 2004లో రామాయంపేట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ స్తూపాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో ఏకై క అమరవీరుల స్తూపం ఇక్కడే ఉండడంతో ఆవిర్భావ ఉత్సవాలను సైతం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు.