భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు | - | Sakshi
Sakshi News home page

భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు

Jul 6 2025 7:11 AM | Updated on Jul 6 2025 7:11 AM

భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు

భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు

● ఐదుగురి అరెస్ట్‌, పరారీలో నలుగురు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి

ఆదిలాబాద్‌రూరల్‌: భూమి పత్రాలను ఫోర్జరీ చేసి, ప్లాట్లను కబ్జా చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తూ యజమానులను బెదిరించిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీసుస్టేషన్‌లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తపూర్‌ కాలనీకి చెందిన జనకొండ పోసాని 2009లో ఖానాపూర్‌ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్‌ 68/44/1లో 30, 38 నంబర్‌ గల రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. మావల పోలీసుస్టేషన్‌ పరిధిలోని పైక్‌ రావు ఆనంద్‌ (మాజీ కౌన్సిలర్‌ కుమారుడు), సద్దాం హుస్సేన్‌, షేక్‌ షాదుల్లా, బోడకుంట రాజు, అజీముద్దీన్‌, సంతోష్‌, మనోహర్‌, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్లను కబ్జా చేశారు. మున్సిపల్‌ అధికారులను మోసం చేసి ఇంటి నంబర్లు పొందారు. దీంతో బాధితురాలు ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం ఐదుగురు నిందితులు పైక్‌ రావు ఆనంద్‌, సద్దాం, షేక్‌ షాదుల్లా, బోడకుంట్ల రాజు, షేక్‌ అజీముద్దీన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా నలుగురు సంతోష్‌, మనోహర్‌, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అరైస్టెన వారిని 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ప్లాట్‌ ఇంటి నంబర్లకు సహకరించిన మున్సిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌, రెవెన్యూ ఆఫీసర్‌ జాదవ్‌ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ముజాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement