
కొత్త ప్లాంట్ నిర్మాణ పనులపై సమీక్ష
జైపూర్: 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించనున్న మూడో యూనిట్ (800మెగా వాట్ల) థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులపై సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు శనివారం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులు వివరించారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సింగరేణి ఉద్యోగి, ఉత్తమ జ్యోతిష్య, జాతీయ ప్రతిభ రత్న, బంగారు నంది అవార్డు గ్రహీత డాక్టర్ దూళిపాళ్ల మల్లికార్జున్‌శర్మను అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జ్యోతిష్యంపై మక్కువతో మల్లికార్జున్‌శర్మ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి జ్యోతిష్యశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు సంస్థ సీఎండీ బలరాం థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకత మీద నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు శ్రీనివాసులు, నరసింహారావు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఏఐటీయూసీ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంవో ఏఐ సెక్రటరీ సంతోష్‌కుమార్, ఏజీఎంలు మురళీధర్, మధన్‌మోహన్, డీజీఎం కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.