
మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కలిశారు. గురువారం ఆయనను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ నెల 4న గ్రామస్థాయి కాంగ్రెస్ నేతలతో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఖర్గే హాజరు కానుండగా సభ నిర్వహణపై చర్చించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవిని ఆశించి భంగపడిన నాయకులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడగా, ప్రేమ్‌సాగర్‌రావుతోనూ చర్చించినట్లు సమాచారం.