
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నెన్నెల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివ రాలు ఇలాఉన్నాయి. మహా రాష్ట్రలోని సిరోంచ తాలూకా పెంటుపాకకు చెందిన బోగె నవీన్ (23) బుధవా రం నెన్నెలలో ఉన్న అత్తగారింటికి వచ్చాడు. మఽ ద్యాహ్నం బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా జోగా పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగా యాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య మాధురి, కుమార్తె ప్రియాన్షిక (10 నెలలు) ఉన్నారు. మాధురి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
ఒకరికి తీవ్రగాయాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బుధవారం రాపల్లి శివారులో అదుపుతప్పి ఓ చెట్టును వేగంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హాజీపూర్ మండలానికి చెందిన పోరెడ్డి ప్రవీణ్, చింతకింది హరీశ్‌కు స్వల్పంగా మల్యాల కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.