
ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల బస్టేషన్, డిపోను ఆర్‌ఎం భవానీప్రసాద్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. బస్‌స్టేషన్ విస్తరణపై చర్చించారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో బస్‌స్టేషన్, డిపో ప్రారంభమయ్యాయని తెలి పారు. అప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. త్వరలోనే అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆర్టీసీ అధికారులు సన్మానించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(కరీంనగర్ జోన్) బుచయ్య, ఆదిలాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంజనేయులు, డీఎం శ్రీనివాసులు, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత తదితరులు ఉన్నారు.