
పట్టు పురుగుల పెంపకానికి అనుమతివ్వాలి..
‘మాది చెన్నూర్ మండలం కిష్టపేట. 40 ఏళ్లుగా అటవీ శాఖకు చెందిన 110 హెక్టార్ల భూమిలో పట్టు పురుగులు పెంచుతూ ఉపాధి పొందుతున్నాం. ఇటవీల అటవీ శాఖ అధికారులు ‘కావ్వల్ టైగర్ రిజర్వర్ పరిధిలో పట్టు పురుగల పెంపకం నిషేధం’ అని బోర్డు పెట్టారు. మమ్మల్ని అటవీ భూముల్లోకి రానివ్వడం లేదు’ అని పట్టుపురుగుల పెంపకం రైతులు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న పట్టుపరిశ్రమ శాఖ ఏడీ పార్వతి రాథోడ్‌ను వివరణ కోరారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని ఏడీ తెలిపారు. ఆ విషయం రైతులకు ఎందుకు తెలుపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అక్కడే తెలియజేశానని, అయినా వచ్చాని వెల్లడించారు. మరోసారి ఇక్కడ వివరించాలని ఆదేశించడంతో ఆమె తెలియజేశారు. అనంతరం రైతులు తమకు ఆధారం చూపాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్ అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. చెట్లు నరకకుండా పెంచుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో కలెక్టర్ వారికి వెల్లడించారు.