
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకుల విద్యార్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ శ్రీకాంత్, పీఈటీ సాగర్ తెలిపారు. జూన్ 29న మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌లో 12–14 ఏళ్ల విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. 14 ఏళ్ల విభాగంలో లాంగ్‌జంప్, పరుగుపందెం పోటీల్లో ఎ.అరుణ్‌కుమార్, 12 ఏళ్ల విభాగంలో జావలిన్‌త్రోలో జి.సాయిచరణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. జులై 6న హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల ను ప్రిన్సిపాల్ మోహన్, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ కె.మహేశ్వర్‌రావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, అధ్యాపకులు అభినందించారు.