
కార్మిక చట్టాల రక్షణకు ఐక్య పోరాటం
జైపూర్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక వి ధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాల పరిరక్షణ కో సం ఐక్య పోరాటం చేయాలని సీఐటీయూ అనుబంధ హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గోమాస ప్రకాశ్ అన్నారు. మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఇందులో భాగంగా జైపూర్ మండలం ఇందారం, టేకుమట్ల, షెట్‌పల్లి గ్రామాల్లో హమాలీలతో కలిసి సమ్మె పో స్టర్లు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మా ట్లాడుతూ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చిందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరసే కుట్రలను తిప్పకొట్టాలన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా, పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 20న జరిగే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్నిరంగాల కార్మికులు పాల్గొనాలని కోరారు.