
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
లోకేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి మహిళ మృతి చెందింది. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పసుల సాయన్న– పసుల గోదావరి (40) దంపతులు. వీరు ఈనెల 6న బావమరిది కూతురు పెళ్లికి మండలంలోని పిప్రి గ్రామానికి బైక్‌పై వచ్చారు. పెళ్లి ముగించుకుని శనివారం బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. మండలంలోని హవర్గ సమీపంలోని శ్మశానవాటిక వద్ద బైక్‌పై నుంచి కళ్లు తిరిగి గోదావరి కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు గోదావరి తమ్ముడు దాస శేఖర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.