● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన్యం ● ‘సాక్షి’ సర్వేలో వెల్లడి | - | Sakshi
Sakshi News home page

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన్యం ● ‘సాక్షి’ సర్వేలో వెల్లడి

May 11 2025 12:14 AM | Updated on May 11 2025 12:14 AM

● ఏ బ

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన

మంచిర్యాలటౌన్‌: అమ్మ.. ఆమె ప్రేమ అనిర్వచనీయం. వెల కట్టలేనిది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. సృష్టికి మూలం అమ్మ. పుట్టిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుగుతుంటే తాను పడిన కష్టాన్ని మరిచి మురిసిపోతుంది. బిడ్డ ఎదుగుదలను తన ఎదుగుదలగానే భావించి జీవితా న్ని త్యాగం చేస్తుంది. అలాంటి తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరూ సమానమే. అందరినీ సమానంగా చూస్తూ వారు ఎంచుకున్న రంగాల్లో ప్రోత్సహిస్తూ ముందంజలో నిలిచేలా ప్రేరణనిస్తుంది. నాన్న ఎంత ప్రేమ చూపించినా తల్లి ప్రేమకే పిల్ల లు కొంత ఎక్కువగా ముగ్ధులవుతారు. ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో 150 మంది విద్యార్థిని, విద్యార్థులతో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ఉదయం నిద్ర నుంచి మేల్కొంది మొదలు అమ్మ సేవలకు తీరికుండదు. ఇంట్లో తల్లి అందించే సేవలకు గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో కుటుంబ నిర్ణయాల్లో తల్లికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ నేటి తల్లులు ఇల్లును చక్కదిద్దడంలోనే కాదు అన్ని రంగాల్లోనూ తమదైన శైలిలో రాణిస్తున్నారు. అందుకే కుటుంబాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా తల్లి పాత్ర ప్రధానంగా ఉంటోంది. మదర్స్‌ డే అంటే కేవలం బహుమతులు ఇవ్వడమే కాదు.. తల్లితో సమయం గడపడమే గొప్ప బహుమతిగా భావిస్తామని అంటున్నారు పిల్లలు.

130

85

20

21

129

65

అమ్మ ప్రోత్సాహంతోనే ఉద్యోగం

మంచిర్యాలటౌన్‌: నా చదువు ఎక్కడా ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రోత్సహించి.. ఉద్యోగం పొందాలని మా అమ్మ నన్ను ఈ స్థాయిలో నిలిపింది. నర్సింగ్‌ చదువులకు ఇంట్లో వారి నుంచి స్పందన రాకపోవడంతో మా అమ్మ జాడి లక్ష్మీ ప్రోత్సాహంతోనే ఈ కోర్సులో జాయిన్‌ అయ్యాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉద్యోగంలో ప్రమోషన్లను సాధిస్తున్నా. నాడు మా అమ్మ ప్రోత్సాహం లేకుంటే ఒక గృహిణిగా ఇంటికే పరిమితం అయ్యేదానిని. నాకు అండగా నిలిచిన మా అమ్మ నేటికీ నాకు చేదోడుగా ఉంటూనే ఉంది.

– సుజాత, ఇంచార్జి ప్రిన్సిపాల్‌, మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ

చదువుతోనే జీవితమని నేర్పింది

మనిషి ఎలాగైనా బతుకొచ్చు కాని చదువుకుంటే జీవితం బాగుంటుందని మా అమ్మ మా చిన్ననాటి నుంచే చెబుతుండేది. మా అమ్మ గృహిణి, ఇంట్లోనే ఉంటూ బీడీలు చుట్టేది. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన నాకు హోంవర్క్‌ చేసుకోమని చెప్పేది. ఇంట్లో ఇతర పనులేవీ చెప్పకుండా కొంత సమయం ఆడుకోమనేది. ఇలా చదువుతోపాటు రిలాక్సేషన్‌ కోసం ఆటలు ఆడుతూ ఒక స్థాయికి వచ్చేందుకు కృషి చేసింది. సివిల్స్‌ రాసేప్పుడు అండగా నిలిచి, తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తావనే భరోసాను ఇచ్చింది. ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్నానంటే మా అమ్మ అండగా నిలవడమే కారణం. మా అమ్మ ద్వారానే చదువు, ఉద్యోగం, ఒక స్థాయి రావడం నా జీవితంలో మర్చిపోలేనది.

– తౌటం శివాజి, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్‌

అమ్మతోనే చెప్పుకునే వాడిని

నా చిన్నతనంలో అమ్మతోనే గడిపిన 11 సంవత్సరాలు ఎంతో కీలకంగా ఉండేవి. ఆ తర్వాత గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టళ్లలోనే ఉండి చదువుకున్నా. నాకు ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా మా అమ్మకే చెప్పేవాడిని. బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడాలని మా అమ్మ ఎంతగానో కోరుకుంది. ఆ కోరిక తీర్చేందుకు బాగా చదివేవాడిని. కానీ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మా అమ్మ నా నుంచి దూరం కావడం, నాకు జాబ్‌ వచ్చే నాటికి అమ్మ లేని లోటును భరించడం నేటికీ నా వల్ల కావడం లేదు. అమ్మ కోరిక తీర్చినా అనే సంతృప్తి ఉన్నా అమ్మ ఉంటే బాగుండుననే బాధ ఉంది.

– సిహెచ్‌.దుర్గాప్రసాద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, మంచిర్యాల

తల్లి లక్ష్మీతో సుజాత

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన1
1/4

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన2
2/4

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన3
3/4

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన4
4/4

● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement