
భారత సైనికుల సేవలు మరువలేనివి
మంచిర్యాలటౌన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు జరిపి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని, అందుకు దీటుగా బదులు ఇస్తున్న భారత సైనికుల సేవలు మరువలేనివని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. శనివారం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో మాజీ దేశ సైనికుల కవాతు, ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉగ్రదాడులతో దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్న ఉగ్రమూకలకు భారత సైన్యం తగిన బుద్ధి చెబుతోందని, దేశ రక్షణలో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని తెలిపారు. ర్యాలీ అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మృతులు, వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం.మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మాజీ దేశ సైనికులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
దేశ సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
పహల్గాంలో మృతులు, ఆర్మీ జవాన్ మురళీనాయక్‌కు నివాళులు
మాజీ సైనికులకు ఎమ్మెల్యే దంపతుల సన్మానం

భారత సైనికుల సేవలు మరువలేనివి