
బీసీ జెండా ఎగురవేస్తాం
● బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్‌కుమార్
బోథ్: ప్రతీ పల్లెలో బీసీ జెండా ఎగురవేస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బీసీ మేలు కోలుపు రథయాత్ర’ శుక్రవారం బోథ్‌కు చేరింది. ఈ సందర్భంగా బోథ్‌లో బీసీ కులాల నాయకులతో కలిసి అంబేడ్కర్, కొమురంభీం, శివాజీ, కొండా లక్ష్మణ్ బాపూ జీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించినట్లు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా, పేదవారుగా ఉన్నారని తెలి పారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ అడ్‌హక్ కమిటీని నియమించారు. సభ్యులుగా జక్కుల వెంకటేశ్, మల్లెపూల శివారెడ్డి, కొండ స్వామి, గంగుల మల్లేశ్, కరిపి శ్రీనివాస్, ఇప్ప శ్రీనివాస్, తడక పోశెట్టి, ఏరుగట్ల రాజును నియమించారు. రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, నామాని అర్జున్, స్థానిక కుల సంఘాల నాయకులు బీ గోవర్ధన్, ఈ శ్రీనివాస్, కర్ణ శ్రీనివాస్, ఆళ్ల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.