
‘అందరికీ వేదం అందిస్తాం’
బాసర: శ్రీవేద భారతి విద్యాపీఠానికి అనుబంధంగా నిర్వహిస్తున్న బాసర శ్రీవేదభారతి వేదవిద్యాల యం నిర్వహణకు వివిధ కుల సంఘాలతో కమిటీ ఏర్పాటు కాగా, అందులోని సభ్యులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బాసరలో వేద విద్యాలయాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. పూర్తి భద్రత ప్రమాణాలతో పాటు వచ్చే విద్యాసంవత్సరంలో నూతన ప్రవేశాలతో వేదవిద్యాలయాన్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల విద్యార్థులు లోహిత్, మణికంఠ ప్రమాదాల్లోమృతి చెందగా బాసర పోలీసులు చట్టప్రకారం కేసులు న మోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని పేర్కొన్నా రు. కొందరు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చే స్తూ హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా యత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దర్యా ప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుని శిక్షించా లని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనలపై కొన్ని మాధ్యమాలు అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే ఎనిమిదేళ్లుగా వైభవంగా కొనసాగించిన దక్షిణ గంగా గోదావరి హారతి ఇ క నుంచి బాసర శ్రీవేద భారతి పీఠం, గ్రామ కమి టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని కమిటీ సభ్యులు తెలి పారు. శ్రీవేద విద్యాలయ సంచలన సమితి బాసర అధ్యక్షుడు శ్యామ్‌సుందర్ మంథని, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, సహ కార్యదర్శి జాదవ్ రాజేశ్‌బాబు, సంజీవరావు, లక్ష్మణ్‌రావు, సతీశ్‌రావు, గాడేకర్ రమేశ్, తుమ్ దత్తు, బిదూర్ రమేశ్, పురోస్తు గోపాలకృష్ణ తదితరులున్నారు.