
నిరుద్యోగ యువతకు ఉపాధి
మంచిర్యాలఅగ్రికల్చర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రా జీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళతో కలిసి రాజీవ్ యువ వికాసం అక్షరాస్యత(నిల్ప్), ఎస్‌ఎస్‌సీ ఫలితా లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికా సం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపా రు. అక్షరాస్యత కార్యక్రమంలో జిల్లాలోని కాసిపేట మండలాన్ని ఎంపిక చేసుకుని 100శాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఇదే స్ఫూర్తితో అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధి కారి రవీందర్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, పురుషోత్తం, గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్దన్ పాల్గొన్నారు.