
చిన్నప్పటి జిందగినే మస్తుండే..
నిర్మల్‌ఖిల్లా: ఎండాకా లంలో నిర్మల్‌లోని మా బేస్తవార్‌పేట గల్లీ దోస్తులతో దెబ్బల చెండు, మూలలాట, కుంటుడు, దేకుడు, దూకుడు, ము ట్టిచ్చుకునుడు, అగ్గిపెట్టెల పత్తాలాట, సిగరెట్ పెట్టెలతో బస్సు కార్లాట, గోటిలాట, ఒక పెద్ద తాడుకు ముడేసి అందులో అంద రం లైన్ కొద్ది నిలబడి ముంగటోడు డ్రైవర్, మధ్యలోడు కండక్టర్‌గా ఎన్నో ఆటల్ని ఆడుకునేటోళ్లం. చొప్పబెండ్లతో అద్దాలు, కుర్చీలు, మంచాలు, కార్లు, బస్సులు చేసుకునేటోళ్లం. తాటి ఆకులతో పంకలు చేసుకుని చేతిలో పట్టుకుని పరుగెత్తేవాళ్లం. జొన్న రొట్టెలను పప్పు, ఊరగాయ కలుపుకొని కడుపునిండా తిని వాకిట్ల బొంతలు పరిచిన మంచాల్లో ఆకాశం వైపు చూస్తూ పడుకుండేది. మా బా పువాళ్లు నిర్మల్ చరిత్ర చెప్పేటోళ్లు. రామాయ ణం, మహాభారతం కథలు కూడా చెప్పేది.
– ధోండి శ్రీనివాస్, నిర్మల్ చరిత్రకారుడు
సెలవులైపోతే ఏడుపొచ్చేది