
వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా
బెల్లంపల్లి: గత ఫిబ్రవరి నుంచి మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ మెడికల్,హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేత పట్టుకుని ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు, కార్మికులు మాట్లాడుతూ ఆలస్యం చేయకుండా వేతన బకాయిలను విడుదల చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏరియాఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఓం నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, లక్ష్మణ్, రమేశ్, నీరజ, సాయి, మహేశ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.