
సమ్మె నోటీసు అందజేత
శ్రీరాంపూర్: దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించే సమ్మెను 17 డిమాండ్లతో కూడిన నోటీసును సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నేతలు యజమాన్యానికి అందించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీ ఎన్. బలరాంనాయక్, డిప్యూటీ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్‌లకు ఈ నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఐఎఫ్‌టీయూసీ జనరల్ సెక్రెటరీ సీతారామయ్య, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.బ్రహ్మానందం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యదర్శి కామెర గట్టయ్య, ఏఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు జి. రాములు, టీఎన్టీ యూసీ జనరల్ సెక్రెటరీ మనీ రాంసింగ్, ఎస్‌జీకేఎస్ అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె ఉంటుందన్నారు. దేశవ్యాప్త డి మాండ్లతోపాటు సింగరేణి పరిధిలో డిమాండ్లను స మ్మెలో పెట్టామన్నారు. సింగరేణిలో కొత్త భూగర్భ గనులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియాలో మాదిరిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గ మనగడ కు ముప్పు తెస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టా లను రద్దు చేయాలన్నారు. కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ నాయకులు బోసు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సమ్మె నోటీసు..
బెల్లంపల్లి: దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సోమవారం బెల్లంపల్లి సీడీపీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు. ఈ సమ్మెకు అంగన్‌వాడీలు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, కార్యదర్శి రాజమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్, నెన్నెల సెక్టార్ నాయకురాలు చంద్రకళ, సువర్ణ, విశ్వనాథ్ పాల్గొన్నారు.