
ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం
తానూరు: మండలంలోని ఉమ్రి(కే) గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైంది. తహసీల్దార్ లింగమూర్తి, బాధిత రైతు నర్సింగ్ తెలిపిన వివరాలు.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో రైతులు సాయంత్రం గడ్డి కుప్పలకు నిప్పంటించారు. వీస్తున్న గాలికి నిప్పురవ్వలు పశువుల పాకలో గడ్డికి అంటుకోవడంతో నిల్వ ఉంచిన పశుగ్రాసంతోపాటు పనిముట్లు కాలి పోయాయి. గ్రామస్తులు అందించిన సమాచారంతో తహసీల్దార్ లింగమూర్తి, ట్రైయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి, అగ్రిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ప్రమాదంలో రూ.40 వేల ఆస్తినష్టం వాటిల్లిందని తహసీల్దార్ తెలిపారు.
వరి పంట దగ్ధం
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్‌కు చెందిన రైతు నసీరాబాద్ శివారులో సాగు చేస్తున్న వరి పంట సోమవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పొలంలో 11 కేవీ వైరు తెగిపడి నిప్పు రాజుకోవడంతో 5 గుంటల వరి దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు.