
రెండు నెలల్లో కొత్త కోర్టు భవనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో కోర్టు భవన నిర్మా ణం మరో రెండు నెలల్లోగా పూర్తవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. శనివారం బెల్లంపల్లి మున్సిఫ్ కోర్టు, కొత్త కోర్టు భవనం పనులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పనులు 90శాతం వర కు పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారుల ను ఆదేశించారు. అంతకుముందు మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తికి జడ్జి ముకేష్, న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సబ్ జడ్జి రామ్మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.