
విద్యార్థుల జంగల్ సఫారీ
హాజీపూర్ మండలం గఢ్‌పూర్ మండల పరిధిలోని ఎంసీసీ క్వారీలో గల జంగల్ సఫారీలో మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన బీజెడ్‌సీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రెక్కింగ్ చేశారు. అటవీ ప్రాంతాన్ని పర్యటిస్తూ వివిధ రకాల చెట్లతో పాటు మెడికేటెడ్ చెట్లు, సఫారీలో ఉన్న వివిధ రకాల పక్షలు, జంతువుల గురించి తెలుసుకున్నారు. గడ్డి వనాలు, ఎత్తయిన కొండలు, అటవీ అందాలను తిలకించారు. ఎఫ్‌బీవోలు రాజేందర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్)