● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వైనం ● నిరుపయోగంగా మామిడి మార్కెట్‌ ● రైతులకు దక్కని ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వైనం ● నిరుపయోగంగా మామిడి మార్కెట్‌ ● రైతులకు దక్కని ప్రయోజనం

Mar 18 2025 12:18 AM | Updated on Mar 18 2025 12:17 AM

ప్రయత్నాలు చేస్తున్నాం

మామిడి కాయల వి క్రయాల కోసం ఎంతగానో యత్నాలు చేస్తున్నాం. నాలుగు నెలల క్రితం ట్రేడర్ల, కమీషన్‌ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవగా హన కల్పించాం. కానీ ఇంతవరకు ఏ ఒక్క రు కూడా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోలేదు. ఎందువల్ల ట్రేడర్లు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. మరోసారి కూడా సమావేశం నిర్వహించి మామిడికాయల కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

– మహ్మద్‌ షాబుద్దీన్‌, మార్కెటింగ్‌ శాఖ జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌

ఎన్నో ఏళ్లుగా నష్టపోతున్నాం..

ఎన్నో ఏళ్ల నుంచి మామిడికాయలు నాగ్‌పూర్‌ మార్కెట్‌కు తీసుకెళ్లి వ్యాపారులు, దళారుల మో సానికి గురవుతూ గిట్టుబాటు ధర రాక మస్తు నష్టపోతున్నం. మోసపోతున్న మామిడి రైతుల ఇబ్బందులను గుర్తించి పదేళ్ల కిందట బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్‌ నిర్మాణం చేసిండ్లు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క ఏడాది సుత కొనుగో ళ్లు చేపట్టలేదు. ట్రేడర్స్‌తో మాట్లాడి కొనుగో ళ్లు చేయించడంలో మార్కెటింగ్‌ అధికారులు పట్టింపు చేస్తలేరు. ఈసారైనా ట్రేడర్స్‌ను ఒ ప్పించి మ్యాంగో మార్కెట్‌లో మామిడి కా యలు అమ్ముకునే అవకాశాలు కల్పించాలి.

– సాటపురి చందు, మామిడి రైతు

బెల్లంపల్లిలోని మామిడి మార్కెట్‌

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని మామిడి మార్కెట్‌లో మామిడి కాయల క్రయవిక్రయాల కోసం మార్కెటింగ్‌ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలి క్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రేడర్లకు అవగాహన కల్పించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరూ ట్రేడ్‌లైసెన్స్‌ తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో యేటా మాదిరిగానే ఈసారి కూడా నాగ్‌పూర్‌ మార్కెట్‌కు తరలించి పంట దిగుబడి అమ్ముకోవా ల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుబాటులో మామిడి మార్కెట్‌ ఉన్నా క్రయవిక్రయాలు చేపట్టకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది.

ఆది నుంచీ సమస్యే..

బెల్లంపల్లి పట్టణంలో మామిడి మార్కెట్‌ ఉన్న మాటే గానీ మామిడి రైతులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోతోంది. క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. మామిడి దిగుబడి కొనుగోలు చేయడానికి ట్రేడర్లు, కమిషన్‌ ఏజెంట్లు మార్కెటింగ్‌ శాఖ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉండగా.. ఏళ్ల తరబడి నుంచి విముఖత చూపుతున్నారు. జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు గత డిసెంబర్‌లో ప్రత్యేక చొరవ తీసుకుని ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. నెలలు గడుస్తున్నా లైసెన్స్‌ తీసుకోవడానికి ట్రేడర్ల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడం నిరాశకు గురి చేస్తోంది. ట్రేడర్లు ముందుకు రాకపోవడం వల్లనే మామిడి మార్కెట్‌లో మామిడి దిగుబడుల క్రయవిక్రయాలు జరగడం లేదు. ట్రేడర్ల సమస్య ప్రతిబంధకంగా మారింది.

సౌకర్యాలు కల్పించినా..

2015 సంవత్సరంలో మ్యాంగో మార్కెట్‌ మంజూ రు కాగా నిర్మాణానికి రూ.1.26 కోట్లు వ్యయం చే శారు. రెండు మ్యాంగో కవర్‌ షీట్స్‌, ప్రహరీ ని ర్మించగా, అదనపు సౌకర్యాల కోసం 2023 సంవత్సరంలో మరో రూ.1.18 కోట్లు కేటాయించారు. వీటిలో నుంచి రూ.8 లక్షలతో ఆర్వో ఫ్లాంట్‌, రూ.36 లక్షలతో మ్యాంగో మార్కెట్‌ అంతర్భాగంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయగా మిగిలిన రూ.74 లక్షలతో మరో కవర్‌షీట్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

పిందె దశలో తోటలు

మామిడి తోటలు పూత దశను దాటి ప్రస్తుతం పిందెలు తొడుగుతున్నాయి. ఉగాది పండుగ నాటికి ఓ మోస్తరు పరిమాణం కాయలు మార్కెట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ చివరి వారం నుంచి దాదాపు మామిడి కాయలు మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. మామిడి దిగుబడుల అమ్మకాలకు సమయం ఆసన్నం అవుతుండగా మరోపక్క ట్రేడర్ల సమస్య మామిడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా రూ.వందల కోట్లకు పైగా సాగే మామిడి వ్యాపారంపై పాలకులు, ప్రభు త్వ అధికారులు శ్రద్ధ వహించకపోవడం రైతులకు శాపంగా

మారింది.

● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వ1
1/2

● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వ

● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వ2
2/2

● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement