అవసరం లేకున్నా ప్లేడేలు | - | Sakshi
Sakshi News home page

అవసరం లేకున్నా ప్లేడేలు

Mar 17 2025 10:57 AM | Updated on Mar 17 2025 10:51 AM

● కిందిస్థాయి అధికారుల హవా ● మస్టర్‌ పడి వెళ్లిపోవడంపై కార్మికుల ఆగ్రహం

కాసిపేట: సింగరేణిలో మస్టర్‌ పడి వెళ్లడం, విధులు తప్పించుకోవడం వదిలేయాలని, ప్రతీ కార్మికుడు ఉత్పత్తి, ఉత్పాదకతలో భాగస్వామి కావాలని సీ అండ్‌ఎండీ బలరామ్‌ సూచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. సాధారణ రోజుల్లో కొందరు మస్టర్‌ పడి వెళ్లిపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అవసరం ఉన్నవారి కి మాత్రమే ప్లేడే ఇవ్వాలని. కానీ, అధికారులు, సూపర్‌వైజర్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు ప్లేడేలు రాసి మస్టర్‌ వేసి ఇంటికి పంపుతున్నట్లు ఆ రోపణలు ఉన్నాయి. మందమర్రి ఏరియా కాసిపేట 2గనిలో జనరల్‌ మజ్దూర్‌గా విధులు నిర్వహించే కార్మికుడికి వరుసగా మూడు ఆదివారాలు ప్లేడే కే టాయించినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. సద రు కార్మికుడు ప్లేడే రోజు మస్టర్‌ పడి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. దీనిపై అతడి గురించి ఆరా తీసేందుకు మీడియా ప్రతినిధులు వెళ్లగా గనిపై కనిపించలేదు. దీంతో స్థానిక కార్మికులను అడగగా, మధ్యాహ్నం అతడిని అధికారులు పిలిపించినట్లు తెలిసింది. సదరు కార్మికుడు మూడు వారాలు మస్టర్‌ పడటం మినహా అవుట్‌ టైం పడిన సందర్భం లేదని గు ర్తించారు. ఉన్నతాధికారులు అవుట్‌ టైం సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరిపించాలని కార్మికులు కోరుతున్నారు.

రెండు గనుల్లో ఇష్టారాజ్యం..

కాసిపేట, కాసిపేట 2 గనులలో మస్టర్ల విషయంలో ఇష్టారాజ్యం నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు కొందరికి మస్టర్‌ వేసి ఇంటికి పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇష్టమైనవారికి ప్లేడేలు ఇస్తున్నారని అంటన్నారు. బాధ్యతగా పనిచేసే కార్మికులకు కూడా వరుసగా మూడు ప్లేడేలు ఇవ్వరని, జనరల్‌ మజ్దూర్‌కు మాత్రం వరుసగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్న కార్మికులకే ప్లేడేలు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. ఈవిషయమై గని మేనేజర్‌ లక్ష్మీనారాయణను వివరణ కోరగా, ఈవిషయం తనదృష్టికి రాలేదని తెలిపారు. వరుసగా మూడు ప్లేడేలు సాధ్యం కాదని వెల్లడించారు. కొందరు కార్మికులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపి వరుసగా మూడు మస్టర్లు ఇస్తే బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement