
పర్యాటక ప్రాంతంగా గాంధారి వనం
● చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్: గాంధారి వనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. చక్కటి చెట్లతో సహజసిద్ధంగా ఉన్న ఈ ఎకో పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంటుందని తెలిపారు. మంచిర్యాల డీఎఫ్‌ఓ శివ్ ఆశీష్‌సింగ్‌తో కలిసి గురువారం బొక్కలగుట్ట గాంధారి వనాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గాంధారి వనాన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వనంలో ఓపెన్‌జిమ్, మరుగుదొడ్లు, రామకృష్ణాపూర్ వైపు నుంచి వచ్చే వాకర్స్ కోసం ఓ గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం కొత్త తిమ్మాపూర్‌లోని షేడ్ కేంద్రంలో రెవరెండ్ థామస్ నెల్యానికి నిర్వహించిన పట్టాభిషేకం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్‌రెడ్డి, అబ్దుల్‌అజీజ్, గోపతి రాజయ్య, శ్యాంగౌడ్, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.