
రమణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు
మంచిర్యాలటౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమణ(ఈఎన్‌టీ) ఎన్నికయ్యారు. అధ్యక్షుడితోపాటు కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నట్లు చీఫ్ ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్.మల్లేశ్, కో ఎన్నికల అధికారులు డాక్టర్ జి.భద్రినారాయణ, డాక్టర్ లక్ష్మీనారాయణ కాటమ్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కేవీఎల్‌ఎన్ మూర్తి, కోశాధికారిగా డాక్టర్ కేఎంఎన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వైద్యులు ఆర్.రవిప్రసాద్, గోలి పూర్ణచందర్, ఎన్.శ్రీనివాస్, ఏ.స్వరూపరాణి, కె.పద్మ, జాయింట్ సెక్రెటరీలుగా వైద్యులు ఎస్.కళావతి, స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా వైద్యులు జి.అన్నపూర్ణ, ఆర్.కీర్తి, వై.శ్రీనివాస్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా బి.రఘునందన్, ఎస్.శరత్‌బాబు, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ బి.వంశీకృష్ణ, డాక్టర్ సీహెచ్.రాధిక, డాక్టర్ బి.రాజేందర్, డాక్టర్ సీహెచ్ సంతోష్, డాక్టర్ బి.ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. కాగా, అధ్యక్షుడు రమణను పలువురు ఘనంగా సన్మానించారు. నస్పూర్ మాజీ సర్పంచ్ రాచకొండ గోపన్న, బీఆర్‌ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, గొంగళ్ల శంకర్, నరెడ్ల శ్రీనివాస్, శెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.